అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఈ రాష్ట్రాల్లో వెనుకంజలో బైడెన్.. ట్రంప్‌దే హవా

ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై రకరకాల విశ్లేషణలు, ముందస్తు అంచనాలతో అమెరికన్ మీడియా హోరెత్తిస్తోంది.నిత్యం ఏదో ఒక మీడియా సంస్థ, ఏజెన్సీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఓపీనియన్ పోల్స్‌ను( Opinion polls ) విడుదల చేస్తున్నాయి.

 Joe Biden Trails Behind Donald Trump In Six Swing States, Opinion Poll Reveals ,-TeluguStop.com

తాజాగా ప్రచురించిన ఓ సర్వేలో అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ( Joe Biden )తన ప్రత్యర్ధి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) కంటే ఏడు కీలక రాష్ట్రాలలో ఆరింటిలో వెనుకబడి వున్నారని తాజా ఓపీనియన్ పోల్ పేర్కొంది.ఓటర్లు జాతీయ ఆర్ధిక వ్యవస్ధపై అసంతృప్తిగా వున్నారని .బైడెన్ సమర్ధత, ఉద్యోగ పనితీరుపై లోతైన సందేహాలు వున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.పెన్సిల్వేనియా, మిచిగాన్, అరిజోనా, జార్జియా , నెవాడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ 2, 8 శాతం పాయింట్ల మధ్య ఆధిక్యంలో వున్నారు.

అయితే విస్కాన్సిన్‌లో ట్రంప్ కంటే బైడెన్ 3 పాయింట్లతో ముందంజలో వున్నారు.సర్వేలోని ప్రతి రాష్ట్రంలో .అధ్యక్షుని ఉద్యోగ పనితీరుపై ప్రతికూల అభిప్రాయాలు 16 శాతంగా వున్నాయి.

Telugu Arizona, Donald Trump, Economic System, Georgia, Joe Biden, Joebiden, Mic

అన్ని ప్రధాన జాతీయ పోల్స్‌ను ట్రాక్ చేసే రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం.ట్రంప్, బైడెన్‌లు నెక్ టు నెక్ ఫైట్‌లో వున్నారు.ప్రధాన జాతీయ సర్వేల సగటు ప్రకారం ట్రంప్.బైడెన్ కంటే 0.8 శాతం పాయింట్లతో ఆధిక్యంలో వున్నారు.నెవాడా , మిచిగాన్, పెన్సిల్వేనియాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో వుండగా. జార్జియాలో బైడెన్ ఒక పాయింట్‌తో ఎడ్జ్‌లో నిలిచారు.ప్రత్యేకించి ఓటర్లు ఆర్ధిక వ్యవస్ధ, ఇమ్మిగ్రేషన్ ( Economic system, immigration )వంటి కీలక సమస్యలను నిర్వహించడంలో ట్రంప్‌పై ఎక్కువ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే అబార్షన్ విషయంలో మాత్రం బైడెన్‌కే ప్రజలు ప్రాధాన్యతను ఇస్తున్నారు.

Telugu Arizona, Donald Trump, Economic System, Georgia, Joe Biden, Joebiden, Mic

అధ్యక్షుడు బైడెన్ ఫిజికల్ ఫిట్‌నెస్‌పైనా సర్వే ప్రస్తావించింది.81 ఏళ్ల బైడెన్‌కు ఈ విషయంలో 28 శాతం మంది.ట్రంప్‌కు 48 శాతం మంది అనుకూలంగా నిలిచారు.ఇదిలావుండగా.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌లను బైడెన్, ట్రంప్‌లు గత నెలలో అధికారికంగా పొందారు.మార్చి 17 నుంచి 24 వరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ పోల్‌ను నిర్వహించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube