భక్తి,త్యాగం,కరుణలకు ప్రతి రూపమే బక్రీద్: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:భక్తి, త్యాగం,కరుణలకు బక్రీద్ ప్రతి రూపమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Guntakandla Jagadish Reddy ) అభివర్ణించారు.సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని చెప్పారు.

 Every Form Of Devotion, Sacrifice And Compassion Is Bakrid: Minister Jagadish Re-TeluguStop.com

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రంలోనీ ఈద్గ వద్ద గురువారం జరిగిన బక్రీద్( Eid al-Adha) పర్వదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.బక్రీద్ సందర్భంగా జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఆయన స్వయంగా కలిసి అలాయ్ బలాయ్ చేసుకున్నారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వమత సౌబ్రాత్వానికి తెలంగాణా ప్రతీకగా నిలిచిందన్నారు.గంగా జమునా తెహజీబ్ ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామన్నారు.

స్వరాష్ట్రంలో సూపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు.మైనారిటీ సంక్షేమంతో పాటు మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు మైనారిటీ గురుకులాలు నెలకొల్పిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube