మహిళా సమస్యలపై బాధ్యతతో వ్యవహరించాలి:ఉస్తేల సృజన

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ మహిళా సమాఖ్య ( Telangana Mahila Samakhya )బాధ్యతాయుతగా వ్యవహరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన పిలుపునిచ్చారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సిపిఐ కార్యాలయం ప్రజా భవన్ లో జరిగిన తెలంగాణ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా( Suryapet District ) స్థాయి విస్తృత సమావేశానికి ఆమె ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అన్ని బూర్జువా పార్టీలు అన్ని వర్గాలకు తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక, ప్రజలను మరిచిపోయారన్నారు.

 Women's Issues Should Be Dealt With Responsibly: Ustela Srijana, Telangana Mahil-TeluguStop.com

ముఖ్యంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకం అరకొరగానే అమలు జరుగుతోందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ( Gas cylinder scheme )కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని,పెళ్లయిన ప్రతి మహిళకు 2500 పథకం ఇంతవరకు అమలులోచుకోలేదని అన్నారు.

ఇంకా మహిళలకు సంబంధించిన అనేక పథకాలు పెండింగ్లో ఉన్నాయని,వాటన్నిటినీ సాధించుకునేందుకు మహిళా సమాఖ్య కృషి చేయాలని,క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని, ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతుందని ఉద్భోదించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు,మహిళలు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube