సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొందరు ఎంపిటిసిలు తమను
అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అధికారులు అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
ఎంపీటీసీలను ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించడం లేదని అధికారులు నిలదీయడంతో గందరగోళం నెలకొంది.
జనవరి 26 నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి కూడా గ్రామాలలో ఎంపీటీసీలు ఆహ్వానించలేదని,ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులైన తమను ఆహ్వానించకుండా అవమానించడం సరైన పద్దతి కాదన్నారు.