సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ( Drainage system )అస్తవ్యస్తంగా తయారై గత కొన్ని నెలలుగా మురుగు నీరు( Sewage ) వీధుల్లో పారుతున్నా పట్టించుకునే వారు లేక కాలనీ వాసులు పరేషాన్ అవుతున్నారు.వీధుల్లో దుర్గంధం వెదజల్లుతూ, ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్తితి నెలకొందని,దోమల బెడద ఎక్కువై అల్లాడుతున్నామని,
అంతేకాక పక్కనే ఉన్న పంట పొలాల్లోకి మురుగు నీరు వెళ్తుండడంతో రైతులు( Farmers ) మట్టికట్టలు వేసుకున్నారని,
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదని, మురుగనీరు,దోమల వల్ల విషజ్వరాల( Poisonous fevers ) భారిన పడుతున్నామని వాపోతున్నారు.
మురికి నీరు( Sewage ) రోడ్డుపై ప్రవహిస్తుండడంతో కాల్వ ఏదో రోడ్డు ఏదో తెలియకుండా పోయిందని,పిల్లలు,వృద్దులు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేసి,నీరు ప్రవహించే విధంగా మోరి కట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.