కాంబోడియా అమ్మాయితో తెలంగాణ అబ్బాయి వివాహం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ నందు శనివారం ఆత్మకూరు (ఎస్) మండలం రామన్నగూడెంకు చెందిన ఇమ్మడి శ్రీనివాస్ శోభల చిన్న కుమారుడు ఇమ్మడి దినేష్ కు కాంబోడియా దేశానికి చెందిన నీక్ విక్ మౌళిక ల వివాహం బంధుమిత్రుల సమక్షంలో శనివారం సాయి బాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.ఇమ్మడి దినేష్ గత పది సంవత్సరాల నుండి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.

 Marriage Of Telangana Boy With Cambodian Girl-TeluguStop.com

అక్కడే కాంబోడియా అమ్మాయి నీక్ వీక్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది.

ఈ వివాహ కార్యక్రమంలో ఇమ్మడి శ్రీనివాస్ శోభల కుటుంబ సభ్యులు,నీక్ వీక్ తల్లిదండ్రులు వన్నిసాయ్ సోక్ -చాన్ మాలి పోవ్ పాల్గొన్నారు.ఈ వివాహ వేడుకల్లో పలువురు పట్టణ ప్రముఖులు జిల్లా ఆర్య వైశ్యు సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా, తప్సి గాంధి,బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోండ్రాల అశోక్ లతో పాటు పలువురు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube