జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెరగాలి.లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరం.
గర్భిణీలకు అవగాహన కల్పించాలి.నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు.
ప్రభుత్వ వైద్యులు నిబద్ధతతో పనిచేయాలి.-జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా నిబద్ధతతో ప్రత్యేక కృషి చేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లింగ నిర్ధారణ,సాధారణ ప్రసవాలపై ఏర్పాటు చేసిన వైద్యాధికారుల సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ మాసంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 69 శాతం సాధారణ ప్రసవాలు జరిగాయని,సాధారణ ప్రసవాలు మరింత ఎక్కువ జరిగేలా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం,వైద్యులు పాల్గొన్నారు.