కేవలం నీళ్లు, టీ మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటే పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉంది.అంతేకాదు, బాగా బక్కచిక్కిపోయి మంచాన పడే ప్రమాదం కూడా ఉంది.
కానీ ఒక వ్యక్తి మాత్రం అది అబద్ధమని నిరూపిస్తున్నాడు.అతడు ఒక వారమో లేక ఒక నెలో కాదు ఏకంగా 45 ఏళ్ల పాటు కేవలం టీ పానీయం, మంచినీళ్లు మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు.
కానీ ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు.సాధారణంగా శరీరానికి అన్ని పోషకాలు లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటాం కానీ ఇతన్ని చూస్తుంటే నీళ్లు, టీ తాగినా ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మక తప్పటంలేదు.
అయితే అతను కావాలనే ఈ రెండు ద్రవ పదార్థాలను తీసుకోవడం లేదు. కటిక పేదరికంతో మరో దిక్కు లేక ఈ అభాగ్యుడు 35 ఏళ్ల వయసు నుంచి ద్రవ పదార్థాలతోనే పొట్ట నింపుకోవడం ప్రారంభించాడు.
అలా కాలక్రమంలో అవి రెండు మాత్రమే ఆహారంగా తీసుకోవడం అలవాటు అయిన ఆయన ఇప్పుడు కూడా వాటిపైనే జీవనం సాగిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.
తమిళనాడు రాష్ట్రం, పుదుక్కోట్టై జిల్లా, కట్టైయాన్‌పట్టి గ్రామంలో నల్లు (80) అనే పండుటాకు నివసిస్తున్నాడు.ఈ వృద్ధుడు గత 45 ఏళ్లుగా తేనీరు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నాడు.
పెళ్ళయిన కొన్ని నెలల తర్వాత ఇతడి భార్య కన్నుమూసింది.అప్పటికే ఆమె ముగ్గురు కుమారులకు, ముగ్గురు కూతుర్లకు జన్మనిచ్చింది.
ఒకవైపు భార్య మరణం, మరోవైపు కటిక పేదరికం అతన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది.ఆ సమయంలో తినడానికి పట్టెడన్నం కూడా అతడికి దొరకలేదు.
రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించే డబ్బుతో పిల్లలకు మాత్రమే అతడు భోజనం పెట్టగలిగేవాడు.పిల్లల పొట్ట నింపుతూ అతను మాత్రం పస్తులు ఉండేవాడు.
మొదట్లో ఒక పూట మాత్రమే భోజనం చేసిన నల్లు ఆ తర్వాత అసలు సాలిడ్ ఫుడ్ తినడమే మానేసాడు.

అలా కేవలం నీరు, టీ మాత్రమే తాగడం మొదలెట్టాడు.పిల్లలకు మాత్రం ఆహారం తెచ్చేవాడు.అయితే కొన్నేళ్ల తర్వాత పిల్లలు పెద్దయి అతడికి పట్టెడన్నం పెట్టే గలిగే స్థాయికి ఎదిగినా అతను మాత్రం అన్నం తినడానికి ఇష్టపడడం లేదు.
ఏవైనా శుభకార్యాలకు వెళ్లినా కేవలం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ఇంటికి వస్తాడే కానీ అక్కడ ఏ ఘన ఆహారం ముట్టడు.అయితే ఇలాంటి ఆహారపుటలవాట్ల వల్ల తన తండ్రికి ఏమైనా అవుతుందేమోనని కుమారులు బాగా ఆందోళన పడేవారు.
రీసెంట్‌గా తమ తండ్రికి మెడికల్ టెస్ట్ కూడా చేయించారు.ఆ టెస్ట్స్ లో నల్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలిందట.
అయితే టీ, నీళ్లు తాగినా తనకేం కాదని, ఇలా జీవించే శక్తిని దేవుడు తనకు ఒక వరంలా అందించాడని నల్లు చెప్పుకొచ్చాడు.







