టాలీవుడ్ ఇండస్ట్రీలో మోగిన సమ్మె సైరన్.. రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికులు సమ్మెకు సైరన్ మోగించారు.గత కొంతకాలం నుంచి సినీ కార్మికులకు ఏమాత్రం వేతనాలు పెంచకుండా తక్కువ వేతనాలతోనే కార్మికులతో పని చేయించుకుంటూ ఉన్నారు.

 Call For Strike In Tollywood Industry Movie Shootings Will Be Closed From Tomorr-TeluguStop.com

ఈ క్రమంలోనే తమకు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు పలుసార్లు తెలియ చేసినప్పటికీ వేతనాల పెంపు విషయంపై ఏమాత్రం నిర్ణయం తీసుకోకపోవడంతో సినీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.తమకు వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ కి రామని కరాఖండిగా తేల్చి చెప్పారు.

రేపటి నుంచి సినీ కార్మికులు సమ్మె చేయడంతో సినిమా షూటింగులు కూడా బంద్ కానున్నాయి.సినీ కార్మికులకు వేతనాలు పెంచే వరకు షూటింగుకు రామని తీర్మానించడమేకాకుండా ఫెడరేషన్ పై ఒత్తిడి తీసుకురావడం కోసం కార్మికులు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే రేపు ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యులు పిలుపునిచ్చారు.రేపు ఉదయం పెద్దఎత్తున ఫిల్మ్ ఫెడరేషన్ చుట్టుముట్టడమే కాకుండా తమకు వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ కూడా నిర్వహించకూడదని డిమాండ్ చేశారు.

Telugu Strike, Tomorrow, Samme Sairan, Telugu, Tollywood-Movie

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సినీ కార్మికులకు వేతనాలు పెరగాలని అయితే గత కొంత కాలం నుంచి తక్కువ వేతనాలతో కార్మికులతో పనులు చేయించుకుంటూ వేతనాలు పెంచడం లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు.సినీ కార్మికులు చేస్తున్న ఈ డిమాండ్ పై నిర్మాణ మండలి ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube