కార్మికుల వేతనాలు పెంచకపోతే సమ్మె తప్పదు:ఏఐటీయూసీ

నల్గొండ జిల్లా: కేంద్రంలోని మెడికల్ కాలేజ్ మరియు హాస్టల్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్,శానిటేషన్ కార్మికుల టెండర్లు వెంటనే పూర్తి చేసి వేతానాలు పెంచాలని ఏఐటీయూసి ఆధ్వర్యంలో గురువారం జిల్లా మెడికల్ కాలేజీ ఏడీ శ్రీనివాస్ కి సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి( Palla Devender Reddy ) మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో టెండర్ల పూర్తి అయి కొత్త వేతనాలు తీసుకుంటున్నప్పటికీ నల్లగొండ మెడికల్ కాలేజ్ మరియు హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం ఇంకా పాత వేతనాలు మాత్రమే వస్తున్నాయన్నారు.

 Strike Inevitable If Workers' Wages Are Not Increased: Aituc , Vijaya, Uma, Renu-TeluguStop.com

టెండర్లు నోటిఫికేషన్ వేసి నెలల తరబడి అవుతున్నప్పటికీ వాటిని పూర్తి చేయడంలో కాలేజీ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.ఆరోపించారు.

ఇప్పటికే కార్మికులు అయిదు నెలల వేతనాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చాలీచాలని వేతనాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,టెండర్లు సక్రమంగా నిర్వహించటంలో కాలేజీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ఆవలంభించిదనివిమర్శించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కే జమీర్,ఎండి జకీర్, అండాలు,విజయ,ఉమా, రేణుక,కవిత,చంద్రమ్మ,కోటేశ్వరి,సీతా,లక్ష్మి,శిల్ప, కృష్ణవేణి,శిల్ప,కనకలక్ష్మి, కరుణ,ఇద్దమ్మ,మంగమ్మ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube