ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన మున్సిపల్ చైర్మన్ బంధువు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 950/2 లో 30 గుంటల ప్రభుత్వ భూమిని అధికారులు రెండేళ్ల క్రితం పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించి అందులో వివిధ రకాలకు చెందిన 1400 మొక్కలు పెట్టి గ్రామపంచాయతీ వారు సంరక్షిస్తున్నారు.ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య వియ్యంకుడు, రిటైర్డ్ ఎంఈఓ కడకంచి కిష్టయ్య ఎప్పటి నుండో ఈ ప్రభుత్వ భూమిపై కన్నేశాడు.

 A Relative Of The Municipal Chairman Who Stole Government Land , Municipal Chair-TeluguStop.com

అధికార పార్టీ అండదండలతో,స్థానిక తహశీల్దార్ తో కుమ్మకై తన తల్లి కడకంచి చిన్న సోమక్క పేరుపై ప్రభుత్వ భూమిని అడ్డదారిలో అక్రమ పట్టా చేపించారు.ఈ విషయంపై మదనపల్లి సర్పంచ్ కోటగిరి పాండరి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోవడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి తమ ఊరికి జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు,గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు హరితహారం పేరుతో అడవులను సంరక్షిస్తూ పల్లెల్లో ప్రకృతి వనాలను పెంపొందించేందుకు కృషి చేస్తుంటే,అదే రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు,రెవెన్యూ అధికారుల అండతో ప్రభుత్వ భూమిలను స్వాహా చేస్తున్నారు.మళ్ళీ ప్రభుత్వ భూమిగా మారుస్తానంటున్న తహసిల్దార్ఇదే విషయమై ఆలేరు తహసిల్దార్ రామకృష్ణను వివరణ కోరగా తనకు రెండు రోజుల సమయం ఇస్తే మళ్ళీ ప్రభుత్వ భూమిగా మారుస్తానని,పై అధికారుల,సీఎం పేషీ నుండి ఫోన్ చేస్తే పని చేసి పెట్టానని చెప్పడం విశేషం.

దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి…!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube