సూర్యాపేట జిల్లా:ప్రభుత్వం ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి రైతులను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy Guntakandla )ఆరోపించారు.శుక్రవారంసూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, మొండికుంట తండా గ్రామాల్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.
గాదరి కిషోర్ కుమార్ తో కలిసి పర్యటించి,ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సూర్యాపేట,తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, వ్యవసాయంపై,ప్రాజెక్టులపై,నీళ్లపై ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు.
ఎస్సారెస్పీ కింద కాళేశ్వరం నీళ్లతో గత నాలుగేళ్లుగా వరుసగా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని,అప్పుడు నీళ్లు అందిస్తుంటే కాలేశ్వరం( Kaleshwaram ) నీళ్లు కావని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని, కాళేశ్వరం నీళ్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.
రైతులు( Farmers ) కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారని, అయినా ప్రభుత్వానికి సోయిలేదని,ఇది కాలం తెచ్చిన కరువు కాదని,కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు.
రైతుల తరఫున పేగులు తేగేదాక దాక కొట్లాడుతామని, ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందించేంత వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ సమయంలో కూడా కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోసి నీళ్లు అందించే అవకాశం వున్నా కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, జిల్లా మంత్రులు మొఖం చాటేశారని,ఎండిన పొలాల వద్దకు పోవడం లేదని,రేవంత్ బూట్లు తుడుస్తున్నారని,జిల్లా మంత్రులు,కోమటిరెడ్డి లాంటి చిల్లర నాయకుడుకి కేసీఆర్( KCR ) ని విమర్శించే స్థాయి లేదని, పాలకులు చేసిన పాపం వల్లనే పొలాలు ఎండిపోయాయని,మేము గత పది రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని,ఎక్కడికి వెళ్లినా బోరున విలపిస్తున్నారని,చెరువులన్ని ఎండిపోయి కనీసం పశుపక్షాదులకు కూడా తాగునీరు దొరకడం లేదని,ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదని,చాలా గ్రామాల్లో మంచినీటి సమస్య కూడా ఉత్పన్నమైందని, అయినా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, రైతుల కోసం ఎంతవరకైనా కొట్లాడుతామని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కరువు పైన సర్వే చేయించి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు
.