గ్యాస్ సబ్సిడీ నమోదు ప్రకీయ వేగం పెంచాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా: మహాలక్ష్మి పథకం( Telangana Mahalakshmi scheme )లో భాగంగా సబ్సిడీ గ్యాస్ నమోదు వివరాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

 Gas Subsidy Registration Process Should Be Speeded Up: Collector, S Venkata Rao,-TeluguStop.com

గరిడేపల్లి మండల కేంద్రం,నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో చేపట్టిన గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల పరిధిలో గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలు సరైన రీతిలో నమోదు కాకపోవడంతో మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో ప్రతి గ్రామ పంచాయతీలలో కూడా తహశీల్దార్లు,ఎంపీడీఓలు, జిపిల ప్రత్యేక అధికారుల సమక్షంలో దరఖాస్తులో గల తప్పులను సరిచేసేందుకు చేపట్టిన ప్రత్యేక యాప్ నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.

జిల్లా అంతటా అన్ని జిపిలు, మున్సిపాలిటీలలో నమోదు కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.గరిడేపల్లి కేంద్రం,నేరేడుచర్ల చిల్లేపల్లి గ్రామంలో కలెక్టర్( Collector ) స్వయంగా పెండెం సైదమ్మ,దుపాటి శ్రీనివాస్ ల సబ్సిడీ నమోదు వివరాలను యాప్ లో పొందుపరిచారు.

తప్పుగా నమోదైన వివరాల ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని తదుపరి మండలాల వారీగా సబ్సిడీ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు.జిపిలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరు పాల్గొనాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గరిడేపల్లి తహశీల్దార్లు కవిత,ఎంపీడీఓ వనజ, నేరేడుచర్ల తహశీల్దార్ సైదులు,ఎంపీడివో శంకరయ్య,జిపి ప్రత్యేక అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube