Wealth : ఇంట్లో సంపాదన నిలవాలంటే ఈ విధంగా చేస్తే చాలు..!

సాధారణంగా వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం ఇంట్లో కొన్ని చర్యలు తీసుకోవడం వలన సంపద, శ్రేయస్సు నిలబడతాయి.అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

 If You Want To Earn Money At Home Just Do It This Way-TeluguStop.com

ఇంట్లో శుక్రవారం నాడు 11 గువ్వలను తీసుకొని ఎర్రటి గుడ్డలో కట్టి పెట్టడం వలన ఆ ఇంట్లో సంపద ( Wealth at home )పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇక లక్ష్మీదేవి, గణేశుడు ( Goddess Lakshmi, Ganesha )బొమ్మలతో తయారు చేసిన నాణేలను పూజ మందిరంలో పెట్టి పూజించి ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం వలన సంపద పెరుగుతుంది.

అంతేకాకుండా ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపం వేయాల్సి ఉంటుంది.

ఇలా ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది.అంతేకాకుండా పూజ స్థలంలో శ్రీ యంత్రాన్ని కూడా స్థాపించాలి.ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

అదే విధంగా ఓం శ్రీం లేదా ఓం హ్రీం శ్రీం ( Om Srim or Om Hreem Srim )అనే కుబేర మంత్రాన్ని కూడా క్రమం తప్పకుండా 108 సార్లు జపించడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది.ఇక కనకధారా స్తోత్రం( Kanakadhara Stotra ) పఠించడం వలన ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది.

అదే విధంగా ఐదు తమలపాకులలో ఐదు లవంగాలు కట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి.

ఇక ఆ తర్వాత ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కున వేలాడదీయాలి.ఇలా వేలాడదీయడం వలన ఇంటికి శ్రేయస్సు, సంపద, ఆనందం లభిస్తుంది.ఈ విధంగా ఈ నియమాలన్నీ పాటించడం వలన మీ ఇంట్లో డబ్బులు నిలబడతాయి.

మీరు ఎంత సంపాదించినా కూడా మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదంటే, సంపద పెరగడం లేదంటే ఈ విధంగా ఈ నియమాలన్నీ పాటించడం వలన కచ్చితంగా మీ ఇంట్లో సంపద పెరుగుతుంది.అదేవిధంగా డబ్బు కూడా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube