ఆదివారం రోజు సూర్య భగవానుడికి.. ఈ పరిహారాలు చేస్తే సమస్యలు దూరం అవ్వడం ఖాయం..!

హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత కచ్చితంగా ఉంటుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.ప్రతి రోజు ఒక్కొక్క విధంగా భగవంతున్ని పూజిస్తారు.

 If You Do These Remedies To The Sun Lord On Sunday, The Problems Will Surely Go-TeluguStop.com

ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిందని పండితులు చెబుతున్నారు.అలాగే సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు.

ఆదివారం రోజు సూర్య భగవానున్ని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన రోజు అని ప్రజలు విశ్వసిస్తారు.సూర్య భగవానున్ని ( Lord Surya )అనుగ్రహం వల్ల జాతకంలో సూర్యగ్రహ స్థానం శుభప్రదమై వ్యక్తి జీవితంలో అనేక విజయాలను పొందుతారు.

Telugu Hindu Dharma, Horoscope, Lord Surya, Omaditya, Omvasudevaya, Ravi Tree, S

సూర్యుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే సుఖం, ఐశ్వర్యం కీర్తి లభిస్తాయి.పురాణ గ్రంధాల ప్రకారం ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలంగా ఉండడం ఎంతో ముఖ్యం.వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి తరచుగా వ్యాధులతో బాధపడతాడు.

అతని జీవితంలో డబ్బులకు ఇబ్బంది పడుతాడు.సమాజంలో తగిన గౌరవం ఉండదు.

అంతేకాకుండా చేపట్టిన పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.ఆదివారం రోజు తీసుకునే కొన్ని చర్యలు సూర్యదేవుడు ప్రసన్నం కావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Telugu Hindu Dharma, Horoscope, Lord Surya, Omaditya, Omvasudevaya, Ravi Tree, S

ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం రోజు( Sunday ) ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి,పూజలు చేసి ఆ తర్వాత ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.ఆదివారం సూర్యుడిని ఆరాధించడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.ఆదివారం రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యా నమః ఓం వాసుదేవాయ నమః( Om Vasudevaya Namah ) ఓం ఆదిత్య నమః అనే మంత్రాన్ని జపించాలి.ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించాలి.

ఇది అన్ని ప్రయత్నాలలో విజయాన్ని వచ్చేలా చేస్తుంది.అలాగే ఆదివారం రోజు నదిలో లేదా చెరువులో చేపలకు ఆహారం అందించాలి.

ఇలా చేయడం వల్ల సూర్యుడు బలవంతుడై అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందుతారు.అంతేకాకుండా ఆదివారం రోజు రావి చెట్టు( Ravi tree ) కింద ఆవాల నూనెతో పిండి దీపం వెలిగించాలి.

ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును వచ్చేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube