ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోని ప్రజలు ప్రతి చిన్న పండుగను కూడా ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకుంటారు అలాంటిది ముఖ్యమైన కార్తిక మాసం ( Kartika masam )రావడం వల్ల ప్రజలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి భగవంతునికి పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు కార్తీక మాసం కోసం ముస్తాబు చేశారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో శివయ్యను( Lord Shiva ) పూజించే భక్తులు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు అంతేకాకుండా ఉల్లి మాంసం మద్యం వంటి వాటికీ కూడా దూరంగా ఉండాలి .

అలాగే నిత్యం దీపారాధనలు చేయాలి నువ్వుల నూనెతో( sesame oil ) వెలిగించే దీపం ఇంటికి అష్టైశ్వర్యాలతో పాటు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను కూడా తెస్తుందని పండితులు చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో ప్రతి రోజు తలస్నానం చేయాలి అలాగే ప్రతి రోజు సాయంత్రం దీపం వెలిగించి పూజ చేయాలి ఇంకా చెప్పాలంటే కార్తిక పురాణం పుస్తకంలో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదవాలి చదవడం రానివారు కార్తిక పురాణాన్ని వినవచ్చు కూడా అలాగే సోమవారాలు కార్తీక పౌర్ణమి పూర్ణిమ ( Kartika Poornami Purnima )విశిష్టమైనవి.అలాగే రోజు పూజ ప్రసాదం తప్పనిసరి దీపం వెలిగించడానికి తప్ప మరే పనికి నువ్వుల నూనె ఉపయోగించకూడదు.

ఈ మాసంలోని 30 రోజులపాటు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి కనీసం సోమవారాలు కార్తీక పూర్ణిమ కోటి సోమవారం మొదలైన శుభదినాలలో దీన్ని తప్పకుండా పాటించాలి.అంతేకాకుండా శ్రీమహావిష్ణువు( Lord Vishnu ) ఆషాడశుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రకు వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేలుకుంటాడు శివుడు కార్తీక పౌర్ణమి రోజున త్రిపుర సురులను సంహరించి ప్రపంచాన్ని రక్షించాడు అలాగే గంగాదేవి నదులు కాలువలు చెరువులు, బావులలోకి ప్రవేశించి వాటిని గంగలా పవిత్రంగా చేస్తుంది అయ్యప్ప దీక్షను ఆర్థిక మాసంలో తీసుకుంటారు దీన్ని మకర సంక్రాంతి వరకు కొనసాగిస్తారని పండితులు చెబుతున్నారు.