దక్షిణాది రాష్ట్రాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.”నేను శైలజా” అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.ఈ క్రమంలోనే మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి అందరిని మెప్పించింది.
కీర్తి సురేష్ కేవలం కమర్షియల్ చిత్రాలలో మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే “పెంగ్విన్”, “మిస్స్ ఇండియా” వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించింది.
ఈ రెండు సినిమాలు కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదల కాగా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె నటించినటువంటి మరో చిత్రం కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నటు తెలుస్తోంది.
తమిళంలో కీర్తి సురేష్ ‘సానికాయిధమ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

మహేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కీలకమైన పాత్రలో సందడి చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాను కూడా థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికీ ప్రముఖ ఓటీటీ సమస్థ నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
త్వరలోనే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ద్వారా అయిన కీర్తి సురేష్ కు ఓటీటీలో మంచి ఫలితం దక్కుతుందా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.