ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం..: మంత్రి బొత్స

విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లా ముఖ్యనేతల సమావేశం జరిగింది.సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Bus Trip Starts From Ichhapuram..: Minister Botsa-TeluguStop.com

ఈనెల 26వ తేదీ నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభమైందని మంత్రి బొత్స తెలిపారు.ఈ మేరకు ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు.175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు జరుగుతాయన్న మంత్రి బొత్స ప్రభుత్వ అభివృద్ధి, ప్రతిపక్షాల అవినీతిని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే మళ్లీ ఏపీకి సీఎం జగన్ ఎందుకు కావాలో కూడా వివరిస్తామని తెలిపారు.

అనంతరం అమిత్ షాతో లోకేశ్ భేటీపై స్పందించిన మంత్రి బొత్స నారా లోకేశ్ ఎవరిని కలుస్తే తమకేంటని ప్రశ్నించారు.ఎవరు ఎవరినీ కలిసినా తమకేం నష్టం లేదన్న మంత్రి బొత్స రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube