ఏపీలో ఎన్నికల ఫలితాలపై( AP election results ) సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ మేరకు ఓట్ల లెక్కింపు కోసం కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది.
అయితే ఏపీలో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ జరగగా.వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే.
కాగా 4 వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.పోస్టల్ బ్యాలెట్ ( Postal Ballot )తో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా.
ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఫలితాలను ప్రకటించనున్నారు.ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.