జేడీఎస్ నేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్( Prajwal Revanna ) అయ్యారు.ఈ మేరకు బెంగళూరు ఎయిర్ పోర్టులో అర్ధరాత్రి ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జపాన్ నుంచి వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అరెస్ట్ చేసింది.
అనంతరం ప్రజ్వల్ కు సంబంధించిన రెండు సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నారు.తరువాత ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కార్యాలయానికి తరలించారు.