ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్‌క్రైమ్.. 200 దేశాలపై టార్గెట్.. చైనీస్ వ్యక్తి అరెస్టు..??

ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్‌క్రైమ్ కు పాల్పడిన ఒక చైనీస్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.అంతర్జాతీయ పోలీసు శాఖ భారీ కంప్యూటర్ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న ఆ చైనా వ్యక్తిని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టింది.

 World's Biggest Cybercrime.. 200 Countries Targeted.. Chinese Man Arrested , Int-TeluguStop.com

ఈ నెట్‌వర్క్, “బాట్‌నెట్( Botnet ) అని పిలుస్తారు, దాదాపు పది ఏళ్లుగా ఈ వ్యక్తి నియంత్రిస్తున్నాడు.ఈ బాట్‌నెట్ ద్వారా నేరగాళ్లు ఐడెంటిటీలను దొంగిలించడం, పిల్లలను హింసించడం, మోసం చేయడం వంటి అనేక నేరాలకు పాల్పడ్డారు.

ఈ నెట్‌వర్క్ ద్వారా మహమ్మారి సహాయ కార్యక్రమాలలో మోసం కూడా జరిగింది.FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే( FBI Director Christopher Wray ) ఈ బాట్‌నెట్ ప్రపంచంలోనే అతిపెద్దదని, దాదాపు 200 దేశాలలోని కంప్యూటర్లను ప్రభావితం చేసిందని తెలిపారు.35 ఏళ్ల యున్హే వాంగ్ అనే ఈ వ్యక్తిని మే 24న సింగపూర్‌లో అరెస్ట్ చేశారు.పోలీసులు సింగపూర్, థాయ్‌లాండ్‌లోని ప్రదేశాలను కూడా గాలించారు.

హ్యాకర్లు 2014 నుంచి వాంగ్ బాట్‌నెట్‌ని ఉపయోగించి బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు, వ్యక్తుల నుండి భారీగా డబ్బు దొంగిలించారు.వారు ప్రభుత్వ రుణ కార్యక్రమాలలో కూడా మోసం చేశారు.టెక్సాస్ లోని న్యాయపత్రాలలో ఇది రుజువైంది.అనుమతి లేకుండా వాంగ్ నియంత్రించిన 19 మిలియన్ కంప్యూటర్ల యాక్సెస్‌ను ఇతర నేరగాళ్లకు అమ్మారు.

నేరగాళ్లు పిల్లలను హింసించడం, ప్రజలను ఇబ్బందుల్లో పడేసేలా చేయడం, బ్యాంకులు, ప్రభుత్వ రుణ కార్యక్రమాల నుంచి డబ్బు దొంగిలించడం వంటి అనేక నేరాలకు పాల్పడ్డారు.అమెరికా న్యాయశాఖ మంత్రి మెరిక్ గార్లాండ్ బాట్‌నెట్‌ను ఆపివేసినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించారు.వాంగ్ బాట్‌నెట్ యాక్సెస్‌ను కొనుగోలు చేసిన నేరగాళ్లు, ముఖ్యంగా సహాయ కార్యక్రమాలపై మోసం ద్వారా రూ.44,650 కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించినట్లు అంచనా.వాంగ్ 150 ప్రత్యేక సర్వర్ల ద్వారా ఈ బాట్‌నెట్‌ను నడిపించాడు.వీటిలో సగం అమెరికా సంస్థల నుంచి అద్దెకు తీసుకున్నాడు.అక్రమంగా సంపాదించిన డబ్బుతో, అతను వివిధ దేశాలలో 21 ఆస్తులను కొనుగోలు చేశాడు.అంతేకాకుండా, అక్కడ పెట్టుబడి పెట్టి సెయింట్ కిట్స్, నెవిస్‌లో పౌరసత్వం కూడా పొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube