ప్రకాశం జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి( YCP Former Minister Balineni Srinivasa Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.నన్ను దొంగ చాటుగా దెబ్బ తీయాలని పార్టీలో వారే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో తనపై తప్పుడు వార్తలు.సృష్టించడం జరిగింది.
అయితే పార్టీ దృష్ట్యా వారి పేర్లు చెప్పటం లేదు.కానీ నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్న నేత ఎవరో మా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ అర్థమయింది.
వాళ్లకి నేరుగా చెబుతున్న దమ్ముంటే స్ట్రైట్ రాజకీయాలు( Politics ) చెయ్.అంతేగాని డబ్బుంది కదా అంటూ ఈ రకంగా తప్పుడు వార్తలు సృష్టించకూడదని బాలినేని పేర్కొన్నారు.
ఈ రకంగా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.ఇదే సమయంలో ఒంగోలులో భూకబ్జాలు( Land Grabs ) విషయంపై విచారణ చేయమని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ విషయంపై సిట్ కూడా వేశారు.కాగా గత పదేళ్ళ నుంచి ఈ భూకబ్జాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతాయా అని నాపై తప్పుడు వార్తలు సృష్టించారు.దీంతో ఈ విషయంలో విచారణ వేగవంతంగా చేసి అనుమానితుల పేర్లు బయట పెట్టమని ఎస్పీ అదే విధంగా కలెక్టర్ నీ కోరినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
అంతేకాకుండా ఒంగోలులో భూకబ్జా పూర్వపరాలను ప్రభుత్వ ఉన్నతాధికారి ధనుంజయ్ రెడ్డికి కూడా వివరించినట్లు బాలినేని స్పష్టం చేశారు.