అక్టోబర్ బాక్సాఫీస్ రివ్యూ.. బాలయ్యే కింగ్.. ఈ నెలలో బ్లాక్ బస్టర్ హిట్టైన మూడు సినిమాలు ఇవే!

అక్టోబర్ నెల పూర్తి కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే న్నాయి.ఈ నెలలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలు మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి.

 October Month Boxoffice Review Tiger Nageswara Rao Bhagavanth Kesari Leo Details-TeluguStop.com

అక్టోబర్ నెలలో రిలీజైన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు ప్రధానంగా భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) పేరు సమాధానంగా వినిపిస్తోంది.ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమాకు 65.36 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.పలు ఏరియాలలో ఈ సినిమా ఇప్పటికే వీరసింహారెడ్డి కలెక్షన్లను బ్రేక్ చేసింది.అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మంత్ ఆఫ్ మధు,( Month Of Madhu ) రూల్స్ రంజాన్,( Rules Ranjan ) మామా మశ్చీంద్ర సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి.

చిన్నా, 800 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

అయితే మ్యాడ్ మూవీ( Mad Movie ) మాత్రం కమర్షియల్ గా హిట్ గా నిలిచి మంచి లాభాలను అందించింది.ఆ తర్వాత వారం రాక్షస కావ్యం, తంతిరం, నాతోనే నేను సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ అయ్యాయి.మూడో వారం విడుదలైన సినిమాలలో భగవంత్ కేసరి, లియో( Leo ) కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాగా మరికొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు.అక్టోబర్ నెల చివరి వారంలో మార్టిన్ లూథర్ కింగ్ విడుదల కాగా ఈ సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేదు.నవంబర్ నెలలో విడుదల కాబోయే సినిమాలలో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయేమో చూడాల్సి ఉంది.బాలయ్య రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube