చైతూ ఫిక్స్.. సమంత వచ్చేది ఎప్పుడు అంటున్న ఫ్యాన్స్

నాగ చైతన్య( Naga chaitanya ) మరియు సమంత సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.కొన్ని కారణాల వల్ల విడి పోయి ఎవరి కెరీర్‌ లో వారు బిజీగా ఉన్నారు.

 Naga Chaitanya And Samantha Web Serieses Streaming Date , Dhootha Web-series-TeluguStop.com

ఇద్దరు కూడా సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ లను కూడా చేయడం వారి వారి అభిమానులకు ఆనందం కలిగించింది.సమంత చేసిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఆమె నటించిన మరో వెబ్‌ సిరీస్ సిటాడెల్‌ మాత్రం ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.అదే సమయంలో నాగ చైతన్య నటించిన ధూత వెబ్‌ సిరీస్( Dhootha Web-Series ) విషయం లో కూడా అదే పరిస్థితి మొన్నటి వరకు ఉంది.

సమంత ప్రధాన పాత్ర లో నటించిన వెబ్‌ సిరీస్ సిటాడెల్‌ ను ఇప్పటి వరకు విడుదల చేసే తేదీ ని ప్రకటించలేదు.కానీ నాగ చైతన్య వెబ్‌ సిరీస్‌ ధూత విషయం లో ఎట్టకేలకు అమెజాన్ వారు క్లారిటీ ఇచ్చారు.

Telugu Amazon Prime, Citadel, Citadel Web, Dhootha Web, Naga Chaitanya, Samantha

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సిటాడెల్‌ సిరీస్ ను మరింత ఆలస్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ధూత సిరీస్ ను డిసెంబర్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.విక్రమ్‌ కే( Vikram k ) కుమార్ దర్శకత్వం లో రూపొందిన ఈ సిరీస్‌ లో నాగ చైతన్య నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Amazon Prime, Citadel, Citadel Web, Dhootha Web, Naga Chaitanya, Samantha

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలం లో ఏ ఒక్క సినిమా లో లేదా సిరీస్‌ లో టచ్ చేయని కథ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు వెబ్‌ సిరీస్ ల్లో చైతూ వెబ్‌ సిరీస్ విషయం లో క్లారిటీ వచ్చింది… కానీ సమంత వెబ్‌ సిరీస్ ను ఎప్పటికి చూస్తాం అంటూ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.వచ్చే ఏడాది ఆరంభం లో అయినా సిటాడెల్‌ వస్తే బాగుండు కదా అన్నట్లుగా సమంత ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube