వచ్చే సంక్రాంతి పండుగకు చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న విషయం తెలిసిందే.చిన్న సినిమాలతో పాటు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.
ఈసారి ఏకంగా మూడు పెద్ద సినిమాలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.ఆ సినిమాలో ఏవి అన్న విషయానికొస్తే.
గేమ్ చేంజర్,( Game Changer ) సంక్రాంతికి వస్తున్నాం,( Sankranthiki Vasthunam ) డాకు మహారాజ్( Daku Maharaj ) సినిమాలో విడుదల కానున్నాయి.వీటితోపాటు ఇంకా చాలా సినిమాలు విడుదల కానున్నాయి.
కానీ ఈ సినిమాలపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.ఇందులో రామ్ చరణ్( Ram Charan ) నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ ట్రైలర్ జనవరి 4న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు( Balayya Babu ) హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా జనవరి 14న విడుదల కానుంది.అయితే గేమ్ ఛేంజర్ ట్రైలర్ కన్నా ముందుగా నందమూరి బాలకృష్ణ డాకూ మహరాజ్ ట్రైలర్ బయటకు వచ్చే అవకాశం వుంది.
రెండున విడుదలకు వీలు అవుతుందేమో అని ప్రయత్నిస్తున్నారు.ఈ ట్రయిలర్ ఎలా వుంటుంది అన్న అసక్తి వుంది.ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని బాలయ్య బాబు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వెంకటేష్( Venkatesh ) హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా జనవరి 14న విడుదల కానుంది.ఈ సినిమాపై కూడా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కొన్ని రకాల సన్నివేశాలు, ముఖ్యంగా సినిమా షూటింగ్ లో బాలయ్య బాబు అనిల్ రావిపూడి మధ్య ఉన్న సన్నివేశాలను కొన్ని విడుదల చేశారు.
అవి సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.ఈ మూడు సినిమాల మధ్యాహ్నం పోటీ గట్టిగానే ఉంది.మరి వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో ఏంటో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.