టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
అందులో భాగంగానే చివరగా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్ ఇప్పుడు సంక్రాంతి పండుగకు గేమ్ చేంజర్ సినిమాతో( Game Changer ) ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.కోలీవుడ్ దర్శకుడు శంకర్( Shankar ) తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంటున్నారు నెలకొన్నాయి.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్గా నటించిందీ.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు, పాటలు, పోస్టర్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు.
ఇప్పటికే గేమ్ చెంజర్ మూవీపై దర్శకుడు సుకుమార్( Director Sukumar ) హైప్ పెంచే కామెంట్స్ చేసారు.ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అద్భుతమని, ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ సీన్స్ అదిరిపోతే సెకండ్ హాఫ్ లో మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్బ్ అనేలా ఉంటాయని తెలిపారు.
అంతేకాకుండా రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు పక్కా అంటూ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.ఇక గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ చెన్నై, హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నా హైదరాబాద్ ఈవెంట్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.ఇక్కడి తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇస్తుందో లేదో అనేది క్లారిటీ లేదు.అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారో చూడాలి మరి.