సినీనటి సమంత ( Samantha ) ప్రస్తుతం పూర్తిగా తన దృష్టిని సినిమాలపైనే పెట్టారు.ఈమె ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.అయితే తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా సమంత బేబీ బంప్ ( Samantha Baby Bump ) తో కనిపించటం గమనార్హం.ఈ విధంగా ఈమె బేబీ బంప్ చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
అసలు సమంత ఏంటి ఇలా బేబీ బంప్ తో కనిపించడం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు బహుశా ఈమె ఏదైనా సినిమాలో ఇలా కనిపించబోతున్నారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక సమంత నాగచైతన్య ( Nagachaitanya ) విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఈమె పలు సందర్భాలలో తనకు తల్లినీ కావాలని ఉంది అంటూ తన మాతృత్వపు కోరికలను బయటపెట్టిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈమె ఇలా కనిపించడంతో అప్పటి విషయాలను కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
మరి సమంత బేబీ బంప్ తో కనిపించడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే ఈమె ఏ సినిమా కోసమో ఇలా కనిపించడం లేదు అయితే సోషల్ మీడియాలో కొంతమంది సమంత ఫోటోని ఇలా క్రియేట్ చేసి షేర్ చేశారని తెలుస్తోంది.ఇవి ఎవరో కావాలని చేసిన పని.ఏ ఏఐ( AI ) ని ఉపయోగించి సమంత ప్రెగ్నెంట్ అంటూ ఫొటోలు క్రియేట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను ఇలా క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో కూడా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.మరి ఈ ఫోటో పై సామ్ రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.