సూర్యాపేట జిల్లా( Suryapet district )శాసన సభ ఎన్నికలు -2023 లో జిల్లాలో దివ్యాంగులు పోలింగ్ 95.83% నమోదు అయినదని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు(S.Venkatrao) తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో దివ్యాంగుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు వసతులు కల్పించడం జరిగిందని, దీనివలన జిల్లాలోని దివ్యాంగుల అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనితెలిపారు.జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం పరిశీలిస్తే… సూర్యాపేట-89%, హుజుర్ నగర్ -96%, కోదాడ-96%,తుంగతుర్తి – 100% దివ్యాంగుల ఓటింగ్ శాతం నమోదు.
అయిందన్నారు.
నియోజకవర్గాల వారీగా దివ్యాంగులకు,అంధులకు అలాగే బధిర ఓటర్లకు ఓటింగ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
అంధులకు ఓటింగ్ పై అవగాహన కల్పించుటకు ఓటింగ్ సూచనలు బ్రెయిల్ లిపిలో ఇవ్వడం జరిగిందని,అలాగే పోలింగ్ రోజు అంధుల ఓటర్లకు బాలెట్ పేపర్ ను బ్రెయిల్ లిపిలో ముద్రించడం, అలాగే ప్రత్యేక స్టిక్కర్స్ ఇవ్వటం జరిగిందన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల కొరకు వాలంటీర్ ని నియమించటం జరిగిందని,సూర్యాపేట జిల్లాలో ఉన్న 728 పోలింగ్ కేంద్ర స్థానాలలో రవాణా సౌకర్యం, వీలుచైర్ సదుపాయం కల్పించటం జరిగిందని, ప్రతి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంను దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్ది,నియోజకవర్గల వారీగా దివ్యాంగుల ఓటర్ల పేర్లు, ఎపిక్ నెంబర్లు,ఫోన్ నెంబర్లు అలాగే ఫొటోస్ బుక్ లెట్ రూపంలో తయారు చేయటంతో ఈ ఫలితాలు సాధించుటకు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అంగన్వాడీ ఆయాలు,అంగన్వాడీ టీచర్లు,( Anganwadi teachers )సూపర్ వైజర్లు, సిడిపివోలు మరియు జిల్లా సంక్షేమ అధికారి అహర్నిశలు కష్టపడ్డారని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అభినందనలు తెలిపారు.
అనంతరం దివ్యాంగుల ఓటర్ల వివరాలు తెలిపే బుక్ లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిడబ్ల్యు జ్యోతి పద్మ,డిఇఓ అశోక్, డి ఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కోటాచలం,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు