పశు వైద్య వృత్తిలో వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి: డా.డి.శ్రీనివాసరావు

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని టీఎన్జీవోస్ యూనియన్ సూర్యాపేట సౌజన్యంతో సూర్యాపేట నాన్-గెజిటెడ్ వెటర్నరీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా దురాజపల్లిలోని ఆలేటి ఆటం ఆశ్రమంలోని గోశాలలో గోవులకి దానా పశుగ్రాసం మరియు వాటి ఎదుగుదలకు కావలసిన క్యాల్షియం మినరల్ మిక్సర్ లాంటివి అందజేశారు.

 Diversity Should Be Encouraged In The Veterinary Profession Dr D Srinivasa Rao,v-TeluguStop.com

అలాగే ఆశ్రమంలోని అనాధ వృద్ధులు వికలాంగులకు పండ్లు మరియు అల్పాహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా సూర్యాపేట జిల్లా పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ బి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ పశు వైద్య వృత్తిలో వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు, కే.శేఖర్,టిఎన్జీవోస్ యూనియన్ సహాధ్యక్షులు ఆకాష్ వర్మ,నాయకులు శ్రీనాథ్,హుస్సేన్ కోడిరెక్క రమేష్,బాలు,మడపడగ సైదులు,కస్పరాజు సైదులు,వెటర్నరీ ఉద్యోగులు చిరంజీవి, శేషగిరి,మురళి,చిరంజీవి, నాగమ్మ,అరుణ,రమణ, నరసింహారావు,ఉపేందర్ కరుణాకర్ రెడ్డి,ఆలేటి ఆటం ఆశ్రమం నిర్వహకురాలు వనజ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube