అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు మహిళా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ బహుమతులు అందించి సన్మానించారు.మార్చి 8 తేదీన నిర్వహించాల్సిన కార్యక్రమం ఆరోజు మహిళా సిబ్బంది అంతా విధుల నిర్వహణలో ఉన్నందున కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి వారిని సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలలు ఊపిన చేతులే ప్రపంచాన్ని నడిపిస్తాయని,తల్లి ప్రేమ అనంతం,తల్లి ప్రేమకు నిర్వచనాలు ఉండవని అన్నారు.పిల్లలకు ఇల్లు మొదటి విద్యాలయం, పిల్లల నడవడిక తల్లికి తెలుస్తుంది,పిల్లలు మంచి మార్గంలో నడవడానికి తల్లి ఎంతో కృషి చేస్తుందని,మహిళగా సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు.
అతి కొద్ది మంది మహిళా సిబ్బందితో జిల్లాలో మహిళాలకు పోలీసు సేవలు అందిస్తున్నామని, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మహిళా సిబ్బంది వెనకాడకుండా విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా ఉంటున్నారని, అటు ఇంటిని,ఇటు ఉద్యోగ నిర్వహణను రెండు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు అన్నారు.ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పురుషులకు ధీటుగా పని చేస్తున్నారని,అన్ని రంగాలలో మహిళలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.
మహిళ అభ్యున్నతికి,మహిళ సాధికారతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని,ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తేవాలని సిబ్బందికి తెలిపారు.
మహిళా సిబ్బంది తెలిపిన సమస్యలపై వెంటనే పరిష్కారాన్ని చూపారు.డీఎస్పీలు మాట్లాడుతూ మహిళా సిబ్బంది యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతూ జిల్లా ఎస్పీ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నారని,మహిళగా తల్లిగా ఎల్లప్పుడూ సమాజం మంచి కోసం పనిచేస్తున్న మహిళలకు నమస్కరిస్తున్నామని అన్నారు.
సిబ్బంది బాగా విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలని తెలిపారు.జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ మహిళా పోలీసు సిబ్బంది జిల్లాలో బాగా పని చేస్తున్నారని,ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు.
మహిళా సిబ్బంది మాట్లాడుతూ విధుల నిర్వహణలో ఎల్లప్పుడూ బిజీబిజీగా ఉంటున్న మాకు,మా విధులను,మమ్ములను ఎప్పటికప్పుడు గుర్తించి ఈరోజు మమ్ములను సన్మానించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి,డిసిఆర్బి డిఎస్పీ రవి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ నరసింహ,ఆర్ఐలు శ్రీనివాసరావు,శ్రీనివాస్, గోవిందరావు, నరసింహారావు,పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచంద్ర గౌడ్,మహిళా పోలీస్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.