సూర్యాపేట జిల్లా:ముస్లిం,మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్( Mallaiah Yadav Bollam ) అన్నారు.శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక 33 వ వార్డులో రూ.5 లక్షల మున్సిపాలిటీ నిధులతో ఆధునికరించిన పీర్ల చావిడిని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకొని వారి సంక్షేమాన్ని విస్మరించాయని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
పీర్ల పండుగకు ప్రత్యేకత ఉందని,పది రోజుల పాటు జరిగే పీర్ల పండుగ ఉత్సవాలు ముఖ్యంగా హిందూ,ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.
పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ ఖదీర్ పాషా,ముస్లిం,మైనార్టీ నాయకులు షేక్ నయీమ్, మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ రహీం,కౌన్సిలర్లు షఫీ,కోట మధు,కందుల చంద్రశేఖర్,షేక్ షఫీ, కల్లూరి పద్మజ,వంటి పులి రమా శ్రీనివాస్,కట్టేబోయిన శ్రీనివాస్,లలిత,రమేష్, ఖాజా మొయినుద్దీన్, ఖాజా,డాక్టర్ బ్రహ్మం, ప్రసాద్ రెడ్డి,నిజాముద్దీన్, ఉపేందర్ గౌడ్,బత్తుల ఉపేందర్,ముస్తఫా, పాండు,షేక్ ఉద్దండు, ఫయాజ్,ముస్తఫా, అల్తాఫ్,అబ్బు,యూసఫ్, షేక్ జానీ,నిస్సార్,అజ్జు, సలీం,ముస్లిం మైనార్టీ నాయకులు,మత పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.