అవినీతి కేసులో సింగపూర్‌లో( Singapore ) భారత సంతతికి చెందిన రవాణా మంత్రి ఎస్ ఈశ్వరన్‌ను కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) అతనిని అరెస్ట్ చేసి ఆపై విడుదల చేసింది.అనంతరం పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీఐబీ ప్రకటించింది.
అతనితో పాటు హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ ఓంగ్ బెంగ్ సెంగ్‌ను( MD Ong Beng Seng ) కూడా అరెస్ట్ చేసినట్లు సీపీఐబీ ప్రతినిధి శుక్రవారం ప్రకటించినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.ఓంగ్‌ను కూడా బెయిల్‌పై విడుదల చేసినట్లు పేర్కొంది.
బెయిల్ షరతులలో భాగంగా పాస్‌పోర్ట్‌లను అప్పగించాలని కోర్ట్ ఆదేశించింది.అత్యవసర పరిస్ధితుల్లో విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని సూచించింది.
ఇదే సమయంలో వ్యాపార పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలన్న ఓంగ్ అభ్యర్ధనను సీపీఐబీ అంగీకరించింది.ఆపై ఓంగ్ బెయిల్ క్వాంటం కూడా 1,00,000 సింగపూర్ డాలర్లకు పెంచారు.
అతను సింగపూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఓంగ్ సీపీఐబీకి రిపోర్ట్ చేయడంతో పాటు పాస్‌పోర్ట్‌ను బ్యూరోకి అప్పగించాలి.ఈ కేసు పరిశోధనకు సంబంధించిన ఇతర వివరాలను అందించడానికి సీపీఐబీ ప్రతినిధి నిరాకరించారు.

కాగా.సీపీఐబీ( CPIB ) ఈ వారం ప్రారంభంలో ఈశ్వరన్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.దీనికి సంబంధించిన తదుపరి వివరాలను మాత్రం ఏజెన్సీ వెల్లడించలేదు.ఇది సింగపూర్‌లో అరుదైన అత్యున్నత స్థాయి విచారణ.అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈశ్వరన్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్.ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
రవాణా శాఖ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ఇతర వ్యక్తులను సీపీఐబీ విచారించాల్సి వుంటుందని ప్రధాని ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలో విచారణ పూర్తయ్యే వరకు సెలవు తీసుకోవాలని ఈశ్వరన్‌ను ఆదేశించారు లీ.ఆయన విధులకు దూరంగా వుంటున్న నేపథ్యంలో సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ ( Minister Chee Hong Tat )రవాణా శాఖ తాత్కాలిక మంత్రిగా వ్యవహరిస్తారని ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో (పీఏపీ) ఈశ్వరన్ పార్లమెంట్ సభ్యుడు.ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు.రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.