సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం( Atmakur (S) Mandal ) నెమ్మికల్ గ్రామంలోని ప్రసిద్ధ దండుమైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ఈనెల 6 నుండి 10 తేదీలలో చేపట్టనున్నట్టు ఆలయ ఈవో కుశలయ్య తెలపగా, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తికాకుండానే ఆలయ కమిటీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తేదీని ఖరారు చేయడంపై భక్తులు( Devotees ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి విస్తరణలో భాగంగా దేవాలయం ముందు డివైడర్ కోసం రోడ్డు తవ్వి అలాగే ఉంచడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రహదారి పనులు పూర్తి కాకుండానే అంత హడావుడిగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తేదీలు ఖరారు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.నిత్యం వందలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నా సరైన సౌకర్యాలు లేవన్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇదివరకు ఉన్న స్నానపు, తలనీలాలు సమర్పించే గదులను ఆర్ అండ్ బీ అధికారులు కూల్చివేశారని,తిరిగి నిర్మిస్తామని చెప్పినా నేటికీ కార్యరూపం దాల్చలేదనిఅంటున్నారు.భక్తులు తలనీలాలు సమర్పించడానికి గదులు లేక చెట్ల కిందనే తలనీలాలు తీయాల్సి వస్తుందని,స్నానాలు చేయడానికి,బట్టలు మార్చుకోవడానికి గదులు లేవని భక్తులు వాపోతున్నారు.
కనీసం తలనీలాలు,స్నానాల కోసం గదులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.