సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి.చింతకాయల శ్రీనివాస్ కు చెందిన గొర్రెల దొడ్డిలోని గొర్రెలపై కుక్కలు దాడి చేసి 20 గొర్రెలను చంపటమే కాకుండా,మిగిలిన గొర్రెలను కూడా గాయపర్చాయి.
మృతి చెందిన గొర్రెల వలన బాధితునికి అందాజ 4లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై విచారణ చేసి చింతకాయల శ్రీనివాస్ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు,గ్రామ సిపిఐ కార్యదర్శి కడియాల అప్పయ్యలు కోరారు.