సూర్యాపేట జిల్లా:దళిత జాతి గర్వపడే ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గోపయ్య అని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గోపయ్య 33వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆ రోజుల్లో సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు.దళిత జాతి గర్వపడే ప్రజాప్రతినిధిగా ఆ వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అన్నారు.
ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేసి దళితుల పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో విశేష కృషి చేశారని వివరించారు.అదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దళితుల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు.
దళితులను ప్రజాప్రతినిధులుగా చేయడమే కాకుండా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు.ఎడ్ల గోపయ్యను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని,ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్,మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్,వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టాకిషోర్,23వ వార్డు కౌన్సిలర్ సౌమ్య జానీ,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, బుల్లెదు దశరథ,కల్లెపల్లి దశరథ,నాతి సవీందర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమళ్ల హుస్సేన్,మాజీ కౌన్సిలర్ ఊర గాయత్రి, అనుములపురి జానకి రాములు,ముక్కంటి,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.