కోదాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలోనే కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావుతో కలసి ఆయన పాల్గొన్నారు.

 Kodada Will Be Made An Ideal Constituency Minister Uttam, Kodada , Ideal Constit-TeluguStop.com

అదనపు ఔట్ సోర్సింగ్ శానిటరీ సిబ్బంది ప్రస్తుత స్థితి,అలాగే కోదాడలో ముస్లిం కమ్యూనిటీ హాల్ స్థల పరిశీలనపై వార్డు కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు,మున్సిపల్ ఇంజనీర్లతో అన్ని అంశాలపై జిల్లా కలెక్టర్ తో కలసి సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచి చూపుతానని,ఇప్పటికే రూ.20 కోట్లపైగా పనులకు శ్రీకారం చుట్టామని,మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి రూ.8 కోట్లు మంజూరు చేశామని,నిబంధనల మేరకు వెంటనే టెండర్లు పిలిచి,పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్ కి పనులు అప్పగించాలన్నారు.అలాగే రూ.6 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణం,రూ.50 లక్షలతో ఖమ్మం ఎక్స్ రోడ్ జంక్షన్ అభివృద్ధి,రూ.1.1 కోట్లతో ముఖ ద్వారాలు,

రూ.4.4.కోట్లతో చేరువు కట్ట బజార్ నుండి అనంతగిరి రోడ్డు వరకు మేజర్ ఔట్ పాల్ డ్రాయిన్ నిర్మాణం చేస్తామన్నారు.పట్టణంలోని పలు వార్డులలో సమస్యలపై ఏర్పాటు చేసుకునే కౌన్సిల్ సమావేశాల్లో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తూ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.తదుపరి ముస్లిం కమ్యూనిటీ హాల్ స్థల పరిశీలన చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,మున్సిపల్ ఈఈ ప్రసాద్,వార్డు కౌన్సిలర్లు,అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube