నల్లగొండ జిల్లా:ప్రస్తుత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా వరి పొట్ట దశలో ఉన్నందున కరెంట్ లోవొల్టేజ్,విపరీతమైన కోతల వలన వరి పొలాలు ఎండిపోయే దశకు చేరుతున్నాయని, అదేవిధంగా బత్తాయి మరియు నిమ్మ తోటలు ఎండిపోయే దశలో ఉన్నాయని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట అప్రకటిత కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
24గంటల ఉచిత కరెంట్ అని గొప్పలు చెబుతూ ప్రభుత్వ పెద్దలు అన్నదాతలను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు.24 గంటల కరెంట్ ఇస్తే రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.కేవలం ఆరు గంటలు రాత్రిపూట మాత్రమే ఇస్తున్నారని,రాత్రిపూట కరెంట్ ఇవ్వడంతో రైతులు పాముకాటుకు గురై చనిపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.పగటిపూట వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా చేసి పంటలను మరియు తోటలను,రైతుల ప్రాణాలను కాపాడాలనికోరారు.
అప్రకటిత కరెంటు కోతల వలన ట్రాన్స్ఫారాలు మరియు మోటర్లు కాలిపోతున్నాయని చెప్పారు.అనంతరం డిఈకి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరి చారి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్,జిల్లా ప్రచార కార్యదర్శి బీపంగి జగ్జీవన్, జిల్లా ఉపాధ్యక్షులు పాదురి వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాక మల్లేష్ యాదవ్,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బుర్ర నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.