ఎన్ని సార్లు వదిలించుకున్నా మళ్లీ మళ్లీ వచ్చి వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మంది చుండ్రు సమస్యతో తీవ్రంగా మదన పడుతున్నారు.
అందులోనూ ప్రస్తుత వర్షాకాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.దాంతో చుండ్రును నివారించే ఖరీదైన షాంపూలను కొనుగోలు చేసి యూస్ చేస్తుంటారు.
అయితే వాటి వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలియదు గానీ.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే మాత్రం చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా మాయం అవ్వాల్సిందే.
మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా గుప్పెడు వేపాకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి కచ్చా పచ్చాగా దంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న వేపాకులు, రెండు టేబుల్ స్పూన్ల నేరేడు గింజల పొడి వేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన నీటిని స్ట్రైనర్ సాయంతో సపరేట్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక.
అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆముదాన్ని కలిపి స్ప్రై బాటిల్ లో నింపుకోవాలి.ఇప్పుడు దీనిని తలకు మరియు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.
గంట లేదా రెండు గంటల పాటు షవర్ క్యాప్‌ను ధరించి.అపై మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా.క్రమంగా తగ్గిపోతుంది.మరియు పైన చెప్పిన రెమెడీని పాటిస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.తద్వారా జుట్టు రాలడం, చిట్లడం, విరగడం వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.