సూర్యాపేట జిల్లా:పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పేరం ముత్తయ్య డిమాండ్ చేశారు.శనివారం ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో టీపీటీఎఫ్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులను వెంటనే చేపట్టాలని,పాఠశాలలో స్కావెంజర్లు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శంకర్ నాయక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుభాని,జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు మందాటి అశోక్,ప్రధాన కార్యదర్శి జిల్లా జానయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు మంచాల శ్యాంకుమార్, రవికుమార్,వడ్లకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.