సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గం( Kodada Constituency )లో మహిళా ప్రజా ప్రతినిధులకు,పార్టీ నాయకులకు కనీస గౌరవం దక్కడం లేదని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జి కన్మంత శశిధర్ రెడ్డి( Kanmantha Shasidhar Reddy ) అన్నారు.మంగళవారం మాజీ ఎమ్మెల్యే చందర్రావు నివాసంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Guntakandla Jagadish Reddy )జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో నాటి ఉద్యమ కాలంలో 80 వేలకు పైగా సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచిన కోదాడ నియోజకవర్గంలో ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కడం లేదని, మహిళా ప్రజా ప్రతినిధులను వివిధ కార్యక్రమాల్లో అవమానపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
నియోజవర్గంలో పార్టీ కార్యకర్తలు సర్పంచ్లు, ఎంపీటీసీలు,జడ్పిటిసిలు, ఎంపీపీలు,పార్టీలోని వివిధ కేడర్లో ఉన్న నాయకులు అందరి కృషితోనే విజయం సాధించామని, గెలుపొందిన తరువాత గర్వంతో స్థానిక ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలపై నాయకులపై కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని నాయకులందరూ ఉమ్మడి నిర్ణయంతో కేసీఆర్( CM KCR ) ను కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నట్లు తెలిపారు.ఎమ్మల్యే అభ్యర్ధి మార్పు తప్పనసరి కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్నేపల్లి చందర్రావు,వేర్నేని బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష, లక్ష్మీనారాయణ,మోతె జడ్పిటిసి పుల్లారావు, అనంతగిరి జడ్పిటిసి ఉమా శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరు జడ్పిటిసి శిరీష,నాగేంద్రబాబు, చిలుకూరు ఎంపీపీ ప్రశాంతి,కోటయ్య, బేతవోలు ఎంపిటిసి వట్టికూటి ధనమూర్తి, సైదులు బాబు,నడిగూడెం వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.