సర్పంచ్ లపై దళితుల దండోరా...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ( Huzur Nagar Constituency ) వ్యాప్తంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీకి చెందిన సర్పంచుల ఏకపక్ష నిర్ణయాలతో దళితుల్లో వర్గాలు ఏర్పడి వైరంతో రగిలిపోతున్నారు.ఇదంతా గ్రామ సర్పంచ్లు అర్హులైన వారిని దళిత బంధుకు ఎంపిక చేయకుండా,తమ పార్టీకి చెందిన అనర్హులను ఎంపిక చేయడంతో మిగతావారు తిరుగుబాటు చేస్తున్నారు.

 Dandora Of Dalits On Sarpanch , Sarpanch, Dandora , Dalits, Huzur Nagar Constitu-TeluguStop.com

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో సర్పంచ్ తనకు అనుకూలమైన వారికే దళిత బంధు అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం దళితులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో వారికీ బీఎస్పీ,బీజేపీ నేతలు మద్దతు పలికారు.గ్రామంలో 300 దళిత కుటుంబాలు ఉంటే సర్పంచ్ ఏకపక్ష నిర్ణయంతో కేవలం బీఆర్ఎస్( BRS ) ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పైరవీకారులకే ఇచ్చారని,అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు.

దీనిపై సర్పంచ్ దళితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ కేసీఅర్ డౌన్ డౌన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు.

పాలకవీడు మండలం బోత్తలపాలెం గ్రామ పంచాయతీ ఆఫిస్ ను దళితులు శుక్రవారం ముట్టడించారు.అర్హులైన దళితులందరికీ దళిత బందు ఇవ్వాలని,ప్రస్తుతం పేర్లు వచ్చిన వాటికి సర్పంచ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో ఐదు నుండి పదిమంది పేర్లు ఇచ్చి దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా గ్రామసభల ద్వారా దళిత బంధు ఎంపిక చెయ్యాలని,ఎంపిక చేసిన అనర్హుల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube