సూర్యాపేట జిల్లా: ఫ్యూడల్ విధానంతో దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీకి తగిన బుద్ధి చెప్పేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు, అన్నదాతలకు ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేయాలని చూస్తున్న మోడీకి గుణపాఠం చెప్తామన్నారు.
వ్యవసాయాన్ని, అన్నదాతలను కాపాడేందుకు ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై మోడీ విషం చిమ్ముతున్నడని,అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నాశనం చేయడమే బీజేపీ వాళ్లు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
దేశ సంపాదనను కార్పోరేట్ శక్తులకు దోచి పెడుతున్న మోడీకి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు.దేశప్రజలను జాగృతం చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు.
ఉధృతమైన పోరాటాలు చేసి,దేశానికి పట్టిన బీజేపీ పీడను వదిలిస్తామన్నారు.బీజేపీ పాలనలో దేశం తిరోగమనం అయిందని, దేశాన్ని బ్రష్టు పట్టించారని మండిపడ్డారు.