అనంతగిరిలో జోరుగా అక్రమ బొగ్గు వ్యాపారం

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం త్రిపురవరం( Tripuravaram ) గ్రామ శివారులో ఉన్న పచ్చని పొలాల్లో గత కొన్నేళ్లుగా బొగ్గుబట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడంతో అనేక మంది బొగ్గు దందాకు మొగ్గు చూపుతున్నారు.

 Illegal Coal Trade Rampant In Anantgiri , Anantgiri, Illegal Coal Trade, Rampant-TeluguStop.com

ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనంతో మొక్కలు నాటుతుంటే, మరోపక్క కంపచెట్ల నరికివేత పేరుతో బొగ్గు వ్యాపారాలు అన్ని రకాల చెట్లను కొట్టి,బట్టీలు పెట్టి కాల్చి బొగ్గు చేసి లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.బొగ్గు బట్టీల( coal furnaces ) నుంచి వెలువడే కాలుష్యం,బూడిదతో పరిసర ప్రాంతాల కలుషితం అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు.

గాలిదుమ్ము వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల పంట పొలాలు,ఇళ్ళను పొగ, బూడిద కమ్ముకొని రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా బొగ్గు తయారికి వస్తున్న కర్రలకు పర్మిషన్ ఉందని చెప్పడం గమనార్హం.

కానీ,ఏ కర్రకు పర్మిషన్ ఉంది,ఏ కర్రను కొట్టి కాల్చుతున్నరో పర్యవేక్షణ లేకపోవడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube