సూర్యాపేట జిల్లా:మనుషులంతా ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటే సమాజంలో ఎవరి పట్ల ఎలాంటి వివక్షా ఉండదని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని 9వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
నిమ్న జాతుల్లో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అంబేద్కర్ జాతికి గొప్ప సందేశాన్ని అందించాలని రాజ్యాంగాన్ని రచించాడన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాడన్నారు.
దళితులు చదువును ఆయుధంగా చేసుకొని చైతన్యవంతులు కావాలని ఎన్నో గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య,ఆహారాన్ని అందిస్తున్నాడని గుర్తుచేశారు.దళితులకు దళితబంధు ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపి దళిత బాంధవుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారన్నారు.
రాష్ట్రంలో జనరల్ స్థానమైన సూర్యాపేటలో మున్సిపల్ చైర్పర్సన్ గా ఒక దళిత మహిళగా తనను నియమించిన అభినవ్ అంబేద్కరుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.కులాలను మనమే నిర్మించుకున్నామని మనుషులంతా ఒక్కటే అనే భావన ఉంటే ఎలాంటి వివక్ష ఉండదన్నారు.
దళితులు చదువును ఆయుధంగా చేసుకొని జీవితంలో అభివృద్ధి చెందాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి,ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చింతలపాటి చిన్న శ్రీరాములు,పట్టణ ఎస్సై క్రాంతికుమార్,వార్డెన్లు ఇందిరా,నీలమ్మ,వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు గుండగాని నాగభూషణం, పిడమర్తి శంకర్,మున్సిపల్ అధికారులు గౌస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.