ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.11
సూర్యాస్తమయం: సాయంత్రం.5.57
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 సా4.00 ల5.30
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:
ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్య అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం:
ఈరోజు మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.ఈ సమయంలో మీరు స్థలం కొనుగోలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది.
మిథునం:
ఈరోజు మీరు తోబుట్టులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.వ్యవసాయదారులు నష్టపోయే అవకాశం ఉంది.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని కొత్త బాధ్యతల్ని పొందుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసారు.అందరూ ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహం:
ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి.ఇంటి నిర్మూలల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని భూమికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తుల:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మానసిక ఆందోళనతో సతమతమవుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
ధనుస్సు:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఏ పని మొదలుపెట్టిన మంచి విజయాన్ని అందుకుంటారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.
మకరం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మానసికంగా కాస్త ఉపశమనం కలుగుతుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
మీనం:
ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బంధువులతో సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
LATEST NEWS - TELUGU