సూపర్ స్టార్ 'జైలర్' స్టోరీ లీక్.. 'ఖైదీ' తరహాలో ఉంటుందంటూ..

స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.రజనీ కాంత్ తమిళ్ హీరో అయినప్పటికీ ఈయనకు ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.సూపర్ స్టార్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన సినిమాలు అంటే ఇప్పటికి అదే క్రేజ్ ఉంటుంది.మరి ప్రెజెంట్ రజనీ కాంత్ ఇంట్రెస్టింగ్ లైనప్ ను లైన్లో పెట్టుకున్నాడు.ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

 Interesting Update On Rajinikanth Jailer, Rajinikanth, Jailer, Tamil Hero, Taman-TeluguStop.com

ప్రెసెంట్ రజనీ కాంత్ ‘జైలర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ సినిమా నుండి పోస్టర్ రివీల్ చేసారు మేకర్స్.ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.

ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా స్టోరీ ఇదే నంటూ నెట్టింట ఒక వార్త ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమా రీసెంట్ గా హిట్ అయినా ‘ఖైదీ’ సినిమా తరహాలోనే ఉంటుంది అని టాక్.అంటే సినిమా మొత్తం కూడా ఒక్క రాత్రి లోనే జరిగిపోతుందట.

ఇదే నిజమైతే ఇలాంటి తరహా కథను నెల్సన్ ఎలా డీల్ చేసి ఉంటాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా ఒక్క రాత్రిలోనే జరిగిన కథ.ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా అలరించింది.మరి ఇప్పుడు జైలర్ సినిమా కూడా ఎలా అలరిస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్య కృష్ణ నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు.ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా.

భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా 2023 వేసవి కానుకగా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube