విజయ్ 'లియో'పై వేరే లెవల్లో క్రేజ్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గేలా లేరుగా!

ప్రెజెంట్ కోలీవుడ్ లో దేని గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది అని అనగానే వెంటనే విజయ్ దళపతి మూవీ అని చెబుతారు.ఎందుకంటే ఈయన గత రెండు రోజుల క్రితమే తన కొత్త మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు.

 Vijay Leo Fans Come Up With Various Theories Details, Thalapathy 67, Thalapathy-TeluguStop.com

ఈ సినిమా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమాను యూనివర్సల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.

విజయ్, లోకేష్ కాంబో అనగానే భారీ హైప్ సెట్ అయ్యింది.వీరిద్దరి కాంబో సూపర్ హిట్ కాంబో కావడంతో కోలీవుడ్ లో దీని గురించి ఫ్యాన్స్ తెగ చర్చించు కుంటున్నారు.

సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.ఇక ఈ సినిమా స్టార్ట్ చెయ్యగానే వరుసగా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

Telugu Karthi Khaidi, Lokeshkanaka, Surya Rolex, Thalapathy, Thalapathyvijay, Tr

ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక నిన్న ఈ సినిమా నుండి టైటిల్ కూడా ప్రకటించారు.విజయ్-లోకేష్ సినిమాకు ‘లియో’ అనే క్రేజీ టైటిల్ ను అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.

Telugu Karthi Khaidi, Lokeshkanaka, Surya Rolex, Thalapathy, Thalapathyvijay, Tr

ఇక ఈ టైటిల్ వచ్చినప్పటి నుండి లోకేష్ యూనివర్స్ కు ఎలా లింకప్ అయ్యి ఉంటుంది అనే అంశాలు మూవీ లవర్స్ లో ఆసక్తిగా మారిపోయాయి.ఇక టైటిల్ వీడియోలో విజయ్ బేకరీలో కనిపించగా దీనిని ఖైదీ లోని కార్తీ రోల్ కు లింకప్ చేస్తూ మాట్లాడు కుంటున్నారు.మరో పక్క విక్రమ్ లో రోలెక్స్ కి చూపించిన తేలు గుర్తు ఇప్పుడు లియో గా ఉంటుందని.

లియో అందరికి బాస్ గా ఉంటాడని రకరకాలుగా ఇంట్రెస్టింగ్ థియరీలు చెబుతున్నారు.మరి ఇన్ని అంచనాల మధ్య లోకేష్ విజయ్ తో భారీ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube