ఈ పవర్ ఫుల్ హెయిర్ సీరంను వారానికి ఒక్కసారి వాడితే జుట్టు రాలనే రాలదు!

సాధారణంగా చాలా మంది తమ జుట్టు అధికంగా ఊడిపోతుందని తెగ హైరానా పడిపోతుంటారు.హెయిర్ ఫాల్ సమస్యను వదిలించుకోవడం కోసం తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు.

 Use This Powerful Hair Serum Once A Week To Prevent Hair Loss , Hair Serum, Hair-TeluguStop.com

కొందరైతే జుట్టు రాలకుండా ఉండేందుకు మందులు కూడా వాడతారు.కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ సీరం వారానికి ఒక్కసారి కనుక వాడితే జుట్టు రాలనే రాలేదు.

పైగా కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ హెయిర్ సీరంను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, మూడు టేబుల్ స్పూన్లు ఎండిన గులాబీ రేకులు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Serum, Long, Thick-Telugu Health

పూర్తిగా చల్లారిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో ఉడికించిన మిశ్రమం నుండి సీరంను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మన పవర్ ఫుల్ హెయిర్ సీరం సిద్దమవుతుంది.ఈ సారం ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Serum, Long, Thick-Telugu Health

నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ సీరం అప్లై చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ పవర్ ఫుల్ హెయిర్ సీరంను కనుక వాడితే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో పల్చగా మారిన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

పైగా ఈ సీరంను వాడటం వల్ల జుట్టు సూపర్ సిల్కీగా షైనీగా మెరుస్తుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube