ఈ పవర్ ఫుల్ హెయిర్ సీరంను వారానికి ఒక్కసారి వాడితే జుట్టు రాలనే రాలదు!

సాధారణంగా చాలా మంది తమ జుట్టు అధికంగా ఊడిపోతుందని తెగ హైరానా పడిపోతుంటారు.

హెయిర్ ఫాల్ సమస్యను వదిలించుకోవడం కోసం తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరైతే జుట్టు రాలకుండా ఉండేందుకు మందులు కూడా వాడతారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ సీరం వారానికి ఒక్కసారి కనుక వాడితే జుట్టు రాలనే రాలేదు.

పైగా కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ హెయిర్ సీరంను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, మూడు టేబుల్ స్పూన్లు ఎండిన గులాబీ రేకులు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. """/"/ పూర్తిగా చల్లారిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో ఉడికించిన మిశ్రమం నుండి సీరంను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మన పవర్ ఫుల్ హెయిర్ సీరం సిద్దమవుతుంది.

ఈ సారం ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

"""/"/ నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ సీరం అప్లై చేసుకోవాలి.

మరుసటి రోజు మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ పవర్ ఫుల్ హెయిర్ సీరంను కనుక వాడితే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో పల్చగా మారిన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.పైగా ఈ సీరంను వాడటం వల్ల జుట్టు సూపర్ సిల్కీగా షైనీగా మెరుస్తుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

అంతా సుద్దపూసలే .. చంద్రకాంత్, పవిత్రలే అంతా తప్పు చేశారా ?