టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగి ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.తన సినిమాల ద్వారా నిర్మాతలకు కచ్చితంగా లాభం చేకూరాలని చిరంజీవి భావిస్తారనే సంగతి తెలిసిందే.
నటుడిగా చిరంజీవి స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా వాల్తేరు వీరయ్య సక్సెస్ చిరంజీవికి, చిరంజీవి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.స్ట్రెయిట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎక్కువగా ఈ సినిమాపై దృష్టి పెడుతున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో మిగతా సినిమాల కంటే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఈ సినిమానే కావడం గమనార్హం.ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న బాబీ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.
అయితే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో బాబీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సెట్ లో పొగడ్తలను అస్సలు పట్టించుకోరని నిర్మాతలకు నష్టం కలిగేలా ఎవరైనా చేస్తే మాత్రం చిరంజీవికి చాలా కోపం వస్తుందని బాబీ కామెంట్లు చేశారు.చిరంజీవిలోని శివుడిని తాను చూశానని మేనేజర్ షాట్ కు పిలవకపోతే చిరంజీవి కోప్పడటం తాను చూశానని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో చిరంజీవి ఛైర్ విసిరేసి మీ బోడి పర్ఫామెన్స్ నాకొద్దు అంటూ కామెంట్ చేశారని బాబీ తెలిపారు.
నేను ఇక్కడ తినే ఇడ్లీతో పోల్చి చూస్తే అక్కడ షాట్ ఇంపార్టెంట్ అని ఆయన చెప్పారని బాబీ కామెంట్లు చేశారు.వర్క్ విషయంలో చిరంజీవి సిన్సియర్ గా ఉంటారని బాబీ కామెంట్లు చేశారు.మరోవైపు ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.